collectorate-siege-under-pdsu-to-solve-education-problems - DD9 Vaartha

విద్య రంగా సమస్యల పరిష్కారం కోసం పీ డి యస్ యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ,కాస్మోటిక్,డైట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి - పి డి యస్ యూ రాష్ట్ర నాయకులు
మునిగెల శివ ప్రశాంత్

విద్యార్థి పోరుబాట యాత్రలో వెలుగులోకి వచ్చిన సమస్యలు

భద్రాచలం, సెప్టెంబర్ 2,(డిడి9 వార్త):విద్యారంగ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు లేకుండా గాలికి వదిలేసిందని, రెండేళ్లుగా విద్యార్థులకు స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్,కాస్మోటిక్, డైట్ బిల్లులు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. సోమవారం పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి మునిగెల శివ ప్రశాంత్ అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడారు. విద్యార్థి పొరబాటయాత్ర గత వారం రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి విద్యార్థుల సమస్యలను పోరుబాట యాత్ర బృందం సర్వే నిర్వహించిందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులను వేధిస్తున్న అనేక సమస్యలు హాస్టల్స్ లో విద్యాసంస్థలలో ఉన్నాయని పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి హాస్టల్స్ బిల్డింగులకు కనీసం రంగులు కూడా వేయలేని స్థితి ఉందని స్కావెంజర్లు లేకపోవడంతో మరుగుదొడ్లు పరిశుభ్రత లేక కంపుకొడుతున్నాయని అన్నారు. బిల్డింగ్ శిధిల అవస్థలో ఉన్నాయని తెలిపారు నూతన గురుకులాలకు సొంత భవనాలు లేవని అద్దె భవనాలలో ఇరుకు గదులలో అవస్థలు పడుతూ విద్యార్థులు తలదాచుకుంటున్నారని ప్రభుత్వం అద్దెను కూడా చెల్లించకపోవడంతో బిల్డింగ్ ఓనర్స్ విద్యార్థులను ఎప్పుడు బయటకు పంపుతారోనని విద్యార్థులు బిక్కుబిక్కున ఉంటున్నారని అన్నారు. లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న అధికారులు కనీసం వసతి గృహాల పర్యవేక్షణ చేయడంలో కూడా వెనుకబడి నిర్లక్ష్యం అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.ఫీజు రియంబర్స్మెంట్ కు మోక్షం ఎన్నడు అని ఆందోళన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు వరుస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వకుండా ప్లీజ్ భాదలను కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై మోపుతోందని అన్నారు. సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు తమ చదువులను రియంబర్స్మెంట్ పై ఆధారపడి కొనసాగిస్తున్నారని రేవంత్ సర్కారు ఒక్క పైసా చెల్లించకపోవడంతో విద్యాసంస్థలు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేమని చేతులెత్తేసినా,విద్యార్థి సంఘాలు సీఎం ఇంటిని ముట్టడించినా ఎలాంటి స్పందన లేకుండా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచించిన మధ్యాహ్న భోజనం నాణ్యతకు మెస్ చార్జీలు పెంచాలని, ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పించాలని ప్రతిపాదించినా కనీసం పరిగణలోకి తీసుకోకుండా రేవంత్ రెడ్డి రాజకీయ మైలేజ్ కోసం స్పోర్ట్స్ ,స్కిల్ యూనివర్సిటీలు,యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపన అంటూ వాటి అభివృద్ధికి ఒకొక్క స్కూలుకు  200 కోట్లు కేటాయిస్తామని రెండేళ్ల కాలంగా ఒక్క పునాదిరాయి కూడా వేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా విద్యారంగ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ నాయకులు  రామ్ చరణ్,అబ్దుల్ గని, జార్జి, విష్ణువర్ధన్, శ్రావణి,సంధ్య, భవాని తదితరులు పాల్గొన్నారు.