women-should-stand-as-maharans-minister-sitakka - DD9 Vaartha

మహిళలు మహారాణులుగా నిలవాలి – మంత్రి సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 20:

యూసుఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రతి మహిళ మహారాణిగా నిలబడేలా సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో పనిచేస్తున్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ బ్యాంకుల ద్వారా వేల కోట్ల రుణాలు అందిస్తున్నాం. గతంలో ఐదు రూపాయలు కూడా చేతిలో లేని స్థితి నుండి, నేడు మహిళలు పెట్రోల్ బంకులు, ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు నడుపుతూ వ్యాపార రంగంలో ముందుకు వెళ్తున్నారు” అని అన్నారు.

ఆమె మాట్లాడుతూ:

• “ప్రతి ఏడాది 25 వేల కోట్ల రుణాలు మహిళా సంఘాలకు ఇస్తున్నాం.”

• “నారాయణపేటలో మహిళా సంఘం నడిపిన పెట్రోల్ బంకు ఆరు నెలల్లో 13.8 లక్షల ఆదాయం సాధించింది.”

• “హైదరాబాద్‌లో 35 క్యాంటీన్లు మహిళా సంఘాల ద్వారా నడుస్తున్నాయి.”

• “ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలను కూడా మహిళా సంఘాలే కుట్టుతున్నాయి. దీని ద్వారా 30 కోట్ల ఆదాయం వస్తోంది.”

• “మహిళా సంఘ సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా, 2 లక్షల లోన్ బీమా కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 410 మంది మరణించగా 40 కోట్ల ఇన్సూరెన్స్ చెల్లించాం. 5,474 మంది మహిళలకు లోన్ బీమా కింద మాఫీ చేశారు.”

టిఆర్ఎస్ గతంలో మహిళలను అవమానించిందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. “మహిళలు కూడబెట్టిన 1800 కోట్ల అభయహస్తం నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం మింగేసింది. నాసిరకం బతుకమ్మ చీరలు ఇచ్చి అవమానించారు. ఇప్పుడు దొంగ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు.

“ప్రతి మహిళ వడ్డీ లేని రుణాలు తీసుకొని ఆర్థికంగా ఎదగాలి. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే సీఎం లక్ష్యం. మహిళలను అవమానించిన టిఆర్ఎస్ నాయకులకు బతుకమ్మ పండుగ సందర్భంలోనే మహిళలు బుద్ధి చెప్పాలి” అని పిలుపునిచ్చారు.

చివరగా రాష్ట్ర ప్రజలకు, మహిళలకు బతుకమ్మ – దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.