-draft--add-your-title - DD9 Vaartha

కొంగాల జలపాతం వద్ద విషాదం.. సెల్ఫీ కోసం వెళ్లి యువకుడు గల్లంతు
ములుగు జిల్లా, వాజేడు సెప్టెంబర్ 21 (డిడి 9 వార్త): వాజేడు మండలంలోని ప్రసిద్ధ కొంగాల జలపాతం వద్ద ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన మహాశ్విన్ అనే యువకుడు సెల్ఫీ కోసం జలపాతం దగ్గరికి వెళ్లి జారి లోతులో పడిపోవడంతో మృతి చెందాడు.

స్నేహితులతో కలిసి పర్యటనకు వచ్చిన ఎనిమిది మంది ఉదయం అనుమతి లేకపోయినా జలపాతం వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో జలపాతం అంచున నిలబడి ఫోటోలు దిగుతుండగా, ఒక్కసారిగా కాలుజారి కింద పడిపోవడంతో మహాశ్విన్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సంఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. మిగతా స్నేహితులు కేకలు వేస్తూ సహాయం కోసం ప్రయత్నించినా అప్పటికే ఆలస్యం అయింది. స్థానికులు, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా అనుమతి లేకుండా జలపాతాల వద్దకు వెళ్లడం, సెల్ఫీల కోసం ప్రాణాలను కోల్పోయిన సంఘటన తో విషాదఛాయలు నెలకొన్నాయి.

స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ – “ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తున్న యువత జాగ్రత్తలు మర్చిపోవడం ప్రాణాలకు ముప్పు అవుతోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు.