the-younger-brother-who-killed-the-land-dispute - DD9 Vaartha

​భూ వివాదం: అన్నను చంపిన తమ్ముడు
వెంకటాపురం, సెప్టెంబర్ 22 (డీడీ 9 వార్త): భూమి విషయంలో తలెత్తిన వివాదం చివరకు ప్రాణాలు తీసింది. వెంకటాపురం మండలం, చిరుతపల్లి గ్రామంలోని సొంత అన్నను ఇనుప గడ్డపారతో కొట్టి చంపిన తమ్ముడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

​వివరాల్లోకి వెళ్తే, చిరుతపల్లి గ్రామానికి చెందిన గొంది మాధవరావు (35), గొంది సాంబశివరావు (30)లు సవతి అన్నదమ్ములు. వీరి తండ్రి లక్ష్మయ్య మరణానంతరం ఆయనకు సంక్రమించిన భూమిని ఇద్దరికీ సమానంగా పట్టా చేశారు. అయితే, తన వాటాకు వచ్చిన భూమిని అమ్ముకునేందుకు సాంబశివరావు ప్రయత్నించగా, అన్న మాధవరావు అడ్డుకున్నాడు. గత పది రోజులుగా ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది.

​ఈరోజు (సెప్టెంబర్ 22, 2025) మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో, సాంబశివరావు అన్న ఇంటికి వెళ్లి మరోసారి గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన సాంబశివరావు ఇంట్లో ఉన్న ఇనుప గడ్డపారను తీసుకుని మాధవరావు తలకు ఎడమ వైపు బలంగా కొట్టాడు. ఈ దాడిలో మాధవరావు తల పగిలి మెదడు బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు.

​మృతుడి చెల్లెలు కోరం నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు సాంబశివరావు కోసం గాలిస్తున్నారు.