smuggling-case-of-luxury-cars-customs-in-prithviraj-dulquer - DD9 Vaartha

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు – పృథ్వీరాజ్, దుల్కర్ ఇళ్లలో కస్టమ్స్ సోదాలు
కేరళలో లగ్జరీ కార్ల స్మగ్లింగ్ వ్యవహారం పెద్ద హంగామా రేపుతోంది. ఈ కేసులో భాగంగా మంగళవారం కస్టమ్స్ అధికారులు మలయాళ టాప్ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నివాసాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. ‘ఆపరేషన్ నమకూర్’ పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ దర్యాప్తులో భాగంగా కోచి, తిరువనంతపురం, పనంపిల్లి నగర్ ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం.

అయితే, వీరి ఇళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లగ్జరీ కార్లు లేదా అనుమానాస్పద ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఇది కేవలం వీరి ఇళ్లకే పరిమితం కాకుండా, కోచి, కోజికోడ్, మలప్పురం సహా కేరళలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి సోదాలు కొనసాగుతున్నాయి.

స్మగ్లింగ్ మాఫియాపై అనుమానాలు

ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం – భూటాన్ ఆర్మీ తమ వాహన శ్రేణిలోని అత్యంత ఖరీదైన కార్లను రిటైర్ చేసి వేలం వేసింది. వాటిని కొందరు ఏజెంట్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, కస్టమ్స్ డ్యూటీ తప్పించుకుని భారతదేశానికి స్మగ్లింగ్ చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ కార్లు హిమాచల్ ప్రదేశ్ మీదుగా దేశంలోని కొన్ని తాత్కాలిక చిరునామాలకు తరలించారని కూడా చెబుతున్నారు.

తర్వాత ఈ కార్లను వ్యాపారవర్గాలు, సినీ రంగానికి చెందిన కొందరికి ప్రత్యేకంగా విక్రయించినట్లు అధికారులకు సమాచారం అందింది. ఇండియా-భూటాన్ ట్రేడ్ నిబంధనల్లో ఉన్న లొసుగులను వినియోగించుకుని ఈ అక్రమ రవాణా జరిగిందని కస్టమ్స్ అనుమానిస్తోంది.

ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు భూటాన్ నుంచి భారత్లోకి వచ్చిన అన్ని వాహనాల రసీదులు, లావాదేవీలు, సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారం చుట్టూ సినీ వర్గాల పేర్లు వినిపించడం కేరళలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.