bhadradri-attacked-a-devotee-in-the-presence-of-ramaiah - DD9 Vaartha

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుడు పై దాడి.
​భద్రాచలం, సెప్టెంబర్ 25: (డిడి 9 వార్త)  భద్రాచలం గోదావరి స్నాన ఘాట్ వద్ద ఇవాళ ఉదయం అత్యంత దారుణమైన అమానుష ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే
భద్రాచలం స్థాన ఘట్టాల వద్ద ఒక వృద్ధురాలితో దుకాణదారుడు సుధాకర్ అనే వ్యక్తి  మద్యం మత్తులో  దురుసుగా ప్రవర్తిస్తున్న సమయంలో అక్కడికి కుటుంబ సభ్యులతో వచ్చిన  ఆంజనేయులు (మిర్యాలగూడ వాసి) భక్తుడు , వృద్ధురాలతో గొడవ  జరుగుతున్న దానిని గమనించి ఆ గొడవ ఆపుదామని అడ్డుకోగా మద్యం మత్తులో ఉన్న సుధాకర్ అనే వ్యక్తి  ఆంజనేయులు ను తలపై రాయితో మోది  అసభ్యకర పదజాలాలతో కర్రతో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆంజనేయులకు తల పగిలి రక్తస్రావం అయింది. ఇది చూసిన భార్య పిల్లలు భయభ్రాంతులై కన్నీరు పెట్టుకున్నారు.
చుట్టుపక్కల వారు ప్రశ్నిస్తే దాడికి దిగిన వ్యక్తి నా పేరు సుధాకర్ నేనిక్కడే దుకాణదారున్ని మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి పోలీస్ కేసు పెట్టుకుంటే పెట్టుకోండి అని దూషిస్తూ చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురి చేశాడు.
స్థానిక గోదావరి నది వద్ద ఉన్న స్విమ్మర్ కరుకు ప్రసాద్ గమనించి 100 కు ఫోన్ చేసి సమాచారం అందించి దాడిలో గాయపడిన ఆంజనేయులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి స్వయంగా తీసుకెళ్లాడు.

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి పలు రాష్ట్రాల నుండి భక్తులు రోజు కొన్ని వందల మంది దర్శనం కోసం భద్రాచలానికి వస్తుంటారు.ముందుగా గోదావరి నది వద్దకు వెళ్లి స్థానాలు ఆచరించి తర్వాత దర్శనం చేసుకుంటారు. ఈ తరుణంలో గోదావరి నది ఒడ్డున  వ్యాపారాలు చేసుకుంటున్న కొంతమంది భక్తులపై చాలా దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇలాగే ఇప్పుడు దాడికి దిగిన సుధాకర్ పై అనేక కేసులు ఉన్నాయి. అయినా కూడా సుధాకర్ ప్రవర్తనలో తీరు మారలేదు.

- ​పోలీసులకు ఫిర్యాదు

దాడికి గురైన భక్తుడు చికిత్స అనంతరం దాడి చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు కుటుంబసభ్యులతో  ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం.

- ​దాడిని తీవ్రంగా ఖండిస్తున్న భక్తులు ప్రజలు

పవిత్ర పుణ్యక్షేత్రంలో, పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై ఇలాంటి దాష్టీకం, ముఖ్యంగా చిన్నారుల ఎదుటే దాడికి పాల్పడడం అత్యంత శోచనీయం ఖండించదగ్గ విషయం. పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే ప్రాంతంలో, వారి భద్రతకు,  వ్యాపారుల అడ్డగోలు ధరల నియంత్రణకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా ఉండాలంటే దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అయినా అక్కడ ఉన్న దుకాణదారులలో మారని తీరు.
ఇకనైనా అధికారులు స్పందించి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం  కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకునెల స్థాన ఘట్టాల వద్ద పోలీస్ కంట్రోల్  రూమ్ ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.