congress-government-ignoring-telangana-water-rights-harish-rao-fire - DD9 Vaartha

తెలంగాణ జల హక్కులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం – హరీశ్ రావు ఫైర్
భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ – “సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్క రాష్ట్రాల లాభాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా చూస్తోందా?” అని ప్రశ్నించారు.

ఆయన వివరాల్లోకి వెళ్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తుంటే, కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే యత్నాలు చేస్తోందని చెప్పారు. ఈ రెండు ముఖ్యమైన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం మౌనం వహించడం రాష్ట్రానికి నష్టమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

“కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణ హక్కులు, వాటాలు ఎప్పటికప్పుడు మేము ప్రస్తావించాం. 2014 జూలై 14న కేంద్రానికి లేఖ రాసి 299 టీఎంసీల కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ సమయంలో మేం ఆ నిర్ణయాన్ని అంగీకరించి ఉంటే, సెక్షన్ 3 కోసం పోరాడేవాళ్లమా? సుప్రీంకోర్టును ఆశ్రయించేవాళ్లమా?” అని ప్రశ్నించారు.

అలాగే సమ్మక్కసాగర్ బ్యారేజీ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్ రావు విమర్శించారు. “ప్రస్తుతం అయినా ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయాలి. మౌనం వీడకపోతే తెలంగాణ జల హక్కులు ప్రమాదంలో పడతాయి” అని ఆయన హెచ్చరించారు.