congress-is-dishonestly-cheating-bcs-–-etala-rages - DD9 Vaartha

కాంగ్రెస్ నిజాయతీ లేకుండా బీసీలకు మోసం చేస్తోంది – ఈటల ఆగ్రహం
హైదరాబాద్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ వేడి చెలరేగింది. బీసీ బంద్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన బీసీలకు న్యాయం చేయాలన్న నిజమైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు.

జూబ్లీ బస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ బీసీ బంద్‌లో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ, “దేశంలో రిజర్వేషన్ల విషయంలో నిజాయతీగా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం తమిళనాడే. తెలంగాణలో అయితే పూర్వపు కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసినా, బీసీ కమిషన్ ఏర్పాటు చేసినా.. వాటి ఫలితాలు ఎక్కడా కనిపించలేద” అని అన్నారు.

అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఈటల విమర్శించారు. “బీసీలు జనాభాలో 52 శాతం ఉన్నా, 42 శాతం మాత్రమే ఉన్నారని కాంగ్రెస్ లెక్కలు చెబుతోంది. అది కాకి లెక్కలు తప్ప మరేమీ కాదు. నేను చెప్పినది అబద్ధమైతే రాజకీయాలను వదిలేస్తా” అని ఆయన స్పష్టం చేశారు.

ఈటల మాట్లాడుతూ, బీసీల స్థానం యాచించే స్థాయిలో కాదని, పాలించే స్థాయిలో ఉందని చెప్పారు. “ప్రాంతీయ పార్టీల పాలనలో అధికారం కుటుంబాలకే పరిమితమవుతోంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఒక్క బీసీ లేదా గిరిజన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేకపోయారు. తెలంగాణలో కనీసం ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉండాలి, కానీ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. వారికిచ్చిన శాఖలు కూడా చిన్నవి” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిజాయతీగా బీసీలకు మద్దతు ఇస్తున్నారని ఈటల అన్నారు. “మోదీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఇది భాజపా నిజాయతీకి నిదర్శనం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టసభల్లోనూ అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది” అని హెచ్చరించారు.

చివరగా, “తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనట్లే బీసీ రాజ్యాధికారమూ సాధ్యమే. బీసీల హక్కుల కోసం ఐక్య ఉద్యమం కొనసాగిద్దాం” అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.