bansuwada-ellaiah-was-the-chief-engineer-who-inspected-the-pond - DD9 Vaartha

బాన్సువాడ ఎల్లయ్య చెరువును పరిశీలించిన చీఫ్ ఇంజనీర్
బాన్సువాడ, నవంబర్ 15(డిడి9 వార్త) :

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు క్రమంగా కబ్జాలకు గురవుతోందన్న ఫిర్యాదులపై జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు శనివారం పట్టణానికి విచ్చేసి చెరువును ప్రత్యక్షంగా పరిశీలించారు.స్థానిక బీజేపీ నాయకులు పలుమార్లు సాగునీటి, రెవెన్యూ, సబ్ కలెక్టర్ కార్యాలయాలకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు కనిపించకపోవడంతో, వారు ఇటీవల రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయాన్ని ఆశ్రయించారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన సహాయకునికి ఫిర్యాదు అందజేయగా, వెంటనే శాఖా అధికారులకు సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు, చీఫ్ ఇంజనీర్‌ను బాన్సువాడకు పంపగా, ఆయన 49 ఎకరాల విస్తీర్ణం గల ఎల్లయ్య చెరువు, దాని కాలువలు, కుంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుప్తి ప్రసాద్, శంకర్ గౌడ్ చెరువు ప్రాంతంలో జరుగుతున్న కబ్జాలను వివరించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎల్లయ్య చెరువు పరిసరాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, చెరువును రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే చెరువుకు సంబంధించిన కాలువలు మరియు నీటి మార్గాలపై అక్రమంగా నిర్మాణాలు నిర్మించిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు అనిల్, పాశం భాస్కర్ రెడ్డి, వెంకట్, సాగునీటి శాఖ అధికారులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.