patel-inspired-development-of-the-state-mla-gandra-satyanarayana - DD9 Vaartha

పటేల్ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నవంబర్ 19  (డి డి 9 వార్త ) :

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని, అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపింప చేస్తున్నామని  భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు  అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్రీడా  ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ 150 ఐక్యత పాదయాత్రను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎమ్మెల్యే, కలెక్టర్లు  పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు.  పటేల్ స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత  ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  భారత దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు.

కలెక్టర్  మాట్లాడుతూ భారత దేశ స్వేచ్ఛ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ తపించేవారని అన్నారు. దేశంలో ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా అందరం  ఒకటేనని చాటి చెప్పారని వివరించారు.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ విశేష కృషి  చేశారన్నారు. భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు.   ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.  అలాగే మన దేశాన్ని డ్రగ్స్ రహిత భారత దేశంగా తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం చేపట్టిన నషా ముక్తి భారత్ అభియాన్ ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం  జెండా ఊపి డా బిఆర్ అంబేద్కర్ స్టేడియం నుండి విగ్రహం వరకు  పాదయాత్రను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్,  సూపరిన్టెండెంట్  బానోతు దేవిలాల్,  అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, యువజన క్రీడల శాఖ అధికారి చిర్రా రఘు, సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి, ఉపాధ్యాయులు కృష్ణ మోహన్,  కార్యక్రమ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు కన్నం యుగదీశ్వర్, తాటికొండ రవి కిరణ్ , గాలిఫ్, వాలంటీర్లు, మహిళా సంఘ సభ్యులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.