we-will-work-to-provide-government-welfare-schemes-for-everyone - DD9 Vaartha

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తాం - ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , భద్రాచలం , సెప్టెంబర్ 1 (డిడి 9 వార్త) గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే ఆదివాసి గిరిజనులు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి అన్ని గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి,తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ ,అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎక్కువ శాతం అర్జీలు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూసమస్యలు,కిరాణాషాపులు ,ఫ్యాన్సీ స్టోర్లు రుణాల కొరకు, సోలార్ విద్యుత్ కనెక్షన్ ద్వారా కరెంటు, బోరు మోటారు ఇప్పించుట కొరకు, జీవనోపాధిపెంపొందించుకోవడానికి స్వయం ఉపాధి రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో కరెంటు సౌకర్యం కొరకు, ఒంటరి మహిళ, వితంతు మహిళ ప్రోత్సాహాల కొరకు ,గిరిజన రైతులకు రైతుబంధు రుణాలు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి శిక్షణలు ఇప్పించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, నూతనంగా మత్య సొసైటీలు ఏర్పాటు కొరకు దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. అశ్వరావుపేట మండలం కేశప్పగూడెం గ్రామానికి చెందిన బేతి రాజమ్మ  మరియు గ్రామస్తులు సోలార్ ద్వారా  కరెంట్ లైన్ లైన్ ఇప్పించుట కొరకు, చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందినకృష్ణవేణి ఫ్లోర్ మిల్ పెట్టుకోవడానికి రుణం ఇప్పించుట కొరకు, కరకగూడెం మండలంకు చెందిన అరుణ జీవనోపాధి కొరకు ఆర్థిక భృతి ఇప్పించుట కొరకు, మణుగూరు మండలంకు చెందిన బాబురావు చేనేత మగ్గాలు ఇప్పించుట కోరకు, బూర్గంపాడు మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు అంగనవాడి మరియు జిపిఎస్ పాఠశాల ఏర్పాటు కొరకు, కామేపల్లి మండలం గోవిందరాల గ్రామానికి చెందిన  రవికుమార్ డ్రోన్ కెమెరా ఇప్పించుట కొరకు, దమ్మపేట మండలం పార్కల గండి గ్రామానికి చెందిన వెంకయ్య తమ పొలంలో సోలార్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, చర్ల మండలంకు చెందిన గిరిజన మహిళలు ఎంఆర్ఎఫ్ పాఠశాల భవనానికి భూమి దానం చేశామని ఆ పాఠశాలలో జీవనోపాధి కొరకు టెంపరరీ ఉద్యోగాలు ఇప్పించుట కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో దాదాపు 160కి పైగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకంగా ఆన్లైన్లో నమోదు చేసి, విడతల వారీగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్,ఏ డీఎం హెచ్ ఓ సైదులు, ఏవో సున్నం రాంబాబు,ఏడి అగ్రికల్చర్/ఎస్ ఓ భాస్కర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్,డిటి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, మేనేజర్ ఆదినారాయణ,  జేడీఎం హరికృష్ణ,ఇతర శాఖల సిబ్బంది ప్రమీల బాయ్, నరేందర్, చలపతి, జోగారావు, మోహన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.