భద్రాచలం ఏరియా వైద్య బృందాన్ని అభినందించిన - డిఎంహెచ్ఓ డాక్టర్ సైదులు.
భద్రాచలం సెప్టెంబర్ 4 ( డిడి 9 వార్త) గర్భనిరోధకసాధకముతో బాధపడుతూ భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు జాయిన్ అయినా గిరిజన మహిళకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాపాయం జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న ఏరియా ఆసుపత్రి డాక్టర్లను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ సూచనలు మేరకు ప్రత్యేకంగా అభినందించినట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ సైదులు అన్నారు.
గురువారం నాడు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఐ సి యులో గర్భనిరోధక సాధకముతో బాధపడుతూ చికిత్స పొందుతున్న గిరిజన మహిళలను ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం రాజుపేట గ్రామానికి చెందిన ఉబ్బా భవాని నిండు గర్భిణీ ఆర్.ఎం.పి డాక్టర్ ను సంప్రదించి పది రోజులుగా వైద్యం చేయించు కుంటుందని కానీ పురిటి నొప్పులతో బాధపడు తుండడంతో ఆర్ఎంపీ డాక్టర్ సూచనలు మేరకు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగిందని, ప్రైవేట్ ఆస్పత్రిలో అన్ని టెస్టులు నిర్వహించి డెలివరీ సమయం అయిపోయిన డెలివరీ కాకపోవడంతో పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహించగా మూడు రోజుల ముందే కడుపులో శిశువు మరణించినట్లు గమనించారని, ఆ విషయాన్ని బయటకు తెలియకుండా ఆర్ఎంపీ శత విధాల ప్రయత్నించాడని కానీ ఇట్టి విషయం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి రాగా వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ రామకృష్ణ మరియు డాక్టర్లు తగు పరీక్షలు నిర్వహించి ఆమెకు ప్రాణాపాయం జరగకుండా అత్యవసర పరిస్థితుల్లో పిండాన్ని తొలగించి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆమె యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం జరిగిందని అన్నారు.
కావున ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులు మరియు గర్భిణీలు ఐటీడీఏ పీవో సూచనల మేరకు ఎటువంటి భయంకర వ్యాధులు ఉన్న తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరీక్షలు మరియు చికిత్సలు చేయించుకోవాలని, ప్రభుత్వ డాక్టర్లు అందిస్తున్న సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఇప్పుడు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా ప్రైవేట్ ల్యాబ్లలో ఐటీడీఏ పీవో సూచించిన ధరల ప్రకారము టెస్టులు నిర్వహిస్తున్నారని, తొందరపడి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లి ఇష్టానుసారంగా తాకతకు మించి వైద్య పరీక్షలు చేయించుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ప్రాజెక్ట్ అధికారి సూచించినట్లు ఆయన తెలిపారు.
గర్భ సాధక బాధతో బాధపడుతున్న మహిళకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఐసీయూలో బాగా శ్రమపడి చికిత్స అందించిన డాక్టర్ సాత్విక గైనకాలజిస్ట్, ఐసీయూ ఇన్చార్జ్ పుష్పలతను ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం గర్భిణీ స్త్రీ కి ఏరియా ఆసుపత్రిలో అందించిన వైద్య పరీక్షలు మరియు ఆమెకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని డిఎంహెచ్ఓ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చైతన్య మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.