బాలాపూర్ లడ్డూ రికార్డు ధర – రూ.35 లక్షలకు లింగాల దశరథ గౌడ్ సొంతం
హైదరాబాద్ డెస్క్ (డిడి9 వార్త)హైదరాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అత్యంత ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రికార్డు స్థాయిలో ముగిసింది.
ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ. 35.00 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ పవిత్ర లడ్డూ రూ. 30.01 లక్షలకు బాలాపూర్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.
దీంతో ఈసారి లడ్డూ ధరలో సుమారు రూ.4.99 లక్షల పెరుగుదల నమోదైంది. ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలం తెలంగాణ ప్రజల్లో విశేష ఆకర్షణగా నిలుస్తూ, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, భక్తులు ఆసక్తిగా పాల్గొనే ఘనతను సంతరించుకుంటోంది.
ఈ లడ్డూ ప్రసాదాన్ని విజయ శుభ సూచకంగా భావిస్తూ, సొంతం చేసుకున్న వారు తమ గృహాలు, వ్యాపారాలు, రాజకీయాలలో అభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. దీంతో వేలం ప్రతి సంవత్సరం ఉత్సాహభరితంగా, కోట్లాది రూపాయల స్థాయికి చేరుకుంటూ కొనసాగుతోంది.
ఈ సారి బాలాపూర్ లడ్డూ ధర పెరగడం మరోసారి ఈ ఆచారానికి ఉన్న ప్రజాదరణను, భక్తి-భావనలను స్పష్టంగా చూపించింది