నిమజ్జనోత్సవంలో హైడ్రా..!
On
హైదరాబాద్, సెప్టెంబర్ 06: నగరంలో శనివారం జరుగుతున్న గణపతి నిమజ్జనోత్సవంలో హైడ్రా భాగస్వామ్యం అయ్యింది. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పర్యవేక్షించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. నేరుగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ శ్రీ ఎన్ అశోక్ కుమార్, హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య గారితో పాటు హైడ్రా DRF అధికారులు శ్రీ జయప్రకాష్, శ్రీ యజ్ఞ నారాయణ, శ్రీ గౌతం, మోహన్ తో పాటు DRF సిబ్బంది పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్లో బోటులో తిరుగుతూ హైడ్రా సిబ్బంది గస్తీ కాస్తున్నారు.
Views: 16
About The Author
Related Posts
Latest News
06 Sep 2025 14:26:00
హైదరాబాద్ డెస్క్ (డిడి9 వార్త)హైదరాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అత్యంత ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రికార్డు స్థాయిలో ముగిసింది.
ఈ ఏడాది...