ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు తప్పనిసరి : సర్పంచ్ మహబూబ్
గ్రామపంచాయతీలో వికసిత్ భారత్ - గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి మరియు జీవనోపాధి గ్యారెంటీ మిషన్ ప్రణాళికల రూపకల్పన పై గురువారం కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మహబూబ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీఓ సదాశివ్ మాట్లాడుతూ.. వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రయోజనాలు ప్రతి ఇంటా స్పష్టంగా కనిపించాలని ఆదేశించారు. గ్రామ సమగ్ర వికాసానికి, శ్రమజీవుల సాధికారతకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్ మహబూబ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం 318 రకాల పనులకు అవకాశమిచ్చిందన్నారు. పడిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు, రైతుల పొలాల్లో పంట కుంటలు నిర్మించుకోవాలని కోరారు. ఉపాధి అవసరమైన కూలీలు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ అరవింద్, ఫీల్డ్ అసిస్టెంట్ సాదుల్లా, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, రైతులు మరియు మహిళలు విశేషంగా పాల్గొన్నారు.
.jpeg)

