సాలూరలో వైభవంగా దసరా వేడుకలు

 సాలూరలో వైభవంగా దసరా వేడుకలు

మండల కేంద్రమైన సాలూరలో​​​ విజయదశమి వేడుకలు అనావాయితీ ప్రకారం అత్యంత వైభవంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని ప్రజలందరూ నూతన వస్త్రాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని జమ్మి వృక్షం వద్ద భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. పూజల అనంతరం గ్రామస్థులు ఒకరికొకరు జమ్మి ఆకులను (బంగారాన్ని) పంచుకుంటూ, ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

​ఈ సందర్భంగా గ్రామ పోలీస్ పటేల్ వెంకట్ రావ్ మాట్లాడుతూ.. విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో, శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Views: 42
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటీటీలో దుమ్మురేపుతున్న స్వాతి ప్రకాష్‌! ఓటీటీలో దుమ్మురేపుతున్న స్వాతి ప్రకాష్‌!
‘నయనం’తో గుర్తింపు..  నా వైఫ్ మిస్సింగ్‌’తో మరోసారి అందరి చూపు తనవైపు! స్వాతితో సినిమా చేస్తా.. హరీష్ శంకర్ అందమైన ప్రేమకథకు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌ జోడించి...
సాలూరలో వైభవంగా దసరా వేడుకలు
అమరవీరుల త్యాగాలు.. సమాజానికి ఆదర్శాలు
పింఛన్లపై సర్కారు జాప్యం... వికలాంగుల హక్కుల వేదిక ఆగ్రహం
బోధన్‌లో అబ్రహం షారన్ కుటుంబీకుల ఆత్మీయ కలయిక
బోధన్‌లో వైభవంగా ఎంవీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం
న్యాయ సేవలు దూరం కాదు.. ఇక ఆర్మూర్‌లోనే!