చౌట్‌పల్లిలో ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చౌట్‌పల్లిలో ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను చౌట్‌పల్లి శక్తికేంద్రం ఆధ్వర్యంలో గురువారం సేవా దృక్పథంతో ఘనంగా నిర్వహించారు. శక్తికేంద్రం ఇన్‌ఛార్జి పుప్పాల నిరంజన్ నాయకత్వంలో స్థానిక ఎంపీయూపీఎస్ గర్ల్స్ పాఠశాలలో విద్యార్థినుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులకు కేక్, పండ్లను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా పుప్పాల నిరంజన్ మాట్లాడుతూ... సమాజానికి సేవ చేయడం, విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మల్లికార్జున్ రెడ్డికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటూ, ఆయన ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎలాల వెంకట్, ముస్కు మహిపాల్, కుంట రమేష్, మహేంద్రపాల్, సత్తా గణేష్, తోట శ్రీధర్, నరేందర్, ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

IMG_20260910_230041

Views: 41
Tags:

About The Author

Related Posts

Latest News

శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు! శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు!
పని పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనా స్పందన శూన్యం.. పక్కనే మరో షెడ్ శరవేగంగా నిర్మాణం   శేరిలింగంపల్లి,అక్టోబర్ 15,(డిడి9 వార్త): శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలోనే అక్రమ...
ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత
బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్
పాఠశాలల్లో అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌లో ఘనంగా 'నానబియ్యం' బతుకమ్మ వేడుకలు
‘వి క్యూబ్’ ప్రారంభానికి బ్రేక్‌!