తగ్గెల్లి లో అర్ధరాత్రి ఇసుక మాఫియా తెగింపు

రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై దౌర్జన్యం.. బైక్ తాళాలు గుంజుకుని హంగామా

తగ్గెల్లి లో అర్ధరాత్రి  ఇసుక మాఫియా తెగింపు

ఆగస్టు 14న పట్టుకున్న వాహనం ఏమైంది? తహసీల్దార్ అజ్మత్ నవాజ్ గోప్యతపై సర్వత్రా అనుమానాలు !

సాలూర మండలంలో అక్రమ ఇసుక మాఫియా ఆగడాలు తీవ్ర రూపం దాల్చాయి. అక్రమ రవాణాను అడ్డుకోబోయిన రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగడమే కాకుండా, అధికారులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన శనివారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. తగ్గెల్లి వద్ద మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో సాలూర రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇసుకను నింపుతున్న ఒక ట్రాక్టర్ డోజార్‌తో పాటు, దానిని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తరలించకుండా సుమారు 20 మందికి పైగా ఉన్న ఇసుక మాఫియా సభ్యులు రెవెన్యూ సిబ్బందిని చుట్టుముట్టి తీవ్రంగా అడ్డుకున్నారు. ఆర్‌ఐ శంకర్ సమాచారంతో అక్కడికి చేరుకున్న ఇద్దరు నైట్ ప్యాట్రోలింగ్ కానిస్టేబుళ్లను సైతం మాఫియా లెక్కచేయలేదు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ, పోలీస్ ద్విచక్ర వాహనం తాళాలను లాక్కున్నారు. ఆర్‌ఐ స్వాధీనం చేసుకున్న ప్రదేశం నుంచి ట్రాక్టర్ డోలీజార్‌ను సమీపంలోని పంట చేన్లలో వైపు కు దౌర్జన్యంగా తరలించుకుపోయారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు కాలుకు గాయమైనట్లు సమాచారం.

కేసుల హెచ్చరికతో దారికి వచ్చి.. మళ్లీ రచ్చ !

ఆగ్రహించిన రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో, సుమారు అర గంట తీవ్ర ఉద్రిక్తతల అనంతరం డోజార్‌ను తిరిగి తీసుకువచ్చారు. అనంతరం వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సి ఉండగా, తహసీల్దార్ కార్యాలయం వద్దే ఉంచాలంటూ మాఫియా సభ్యులు మళ్లీ అడ్డుపడి ఒత్తిడి తెచ్చారు.

తహసీల్దార్ వైఖరిపై తీవ్ర అనుమానాలు

కాగా, గత నెల 14న కూడా ట్రాక్టర్ డోజార్‌ను ఆర్‌ఐ తగ్గెల్లి మంజీరా వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నింపుతుండగా పట్టుకున్నారు. అయితే, ఆ వాహనాన్ని ఇప్పటి వరకు తహసీల్దార్, పోలీస్ కార్యాలయాలకు తరలించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడ ఉందో, దానిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పకుండా తహసీల్దార్ అజ్మత్ నవాజ్ గోప్యత పాటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిందిస్థాయి అధికారులు ప్రాణాలకు తెగించి అక్రమ ఇసుక వాహనాలను పట్టుకుంటే, పట్టుబడిన వాహనాలు పదే పదే ఆ వాహనాలు పట్టు బడితే తహసీల్దార్ నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టి వదిలివేస్తున్నారనే ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే ఇసుక మాఫియా ఈ స్థాయిలో బరితెగించి, ఏకంగా చట్టాన్ని పరిరక్షించే అధికారుల పైనే దాడులు చేసే స్థాయికి చేరిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి నిష్పాక్షిక విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

WhatsApp Image 2026-09-06 at 6.23.38 PM

                                        ఆగస్టు 14న రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పట్టుకున్న డోజర్

Views: 87
Tags:

About The Author

Related Posts

Latest News

శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు! శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు!
పని పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనా స్పందన శూన్యం.. పక్కనే మరో షెడ్ శరవేగంగా నిర్మాణం   శేరిలింగంపల్లి,అక్టోబర్ 15,(డిడి9 వార్త): శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలోనే అక్రమ...
ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత
బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్
పాఠశాలల్లో అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌లో ఘనంగా 'నానబియ్యం' బతుకమ్మ వేడుకలు
‘వి క్యూబ్’ ప్రారంభానికి బ్రేక్‌!