బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్

పాటల ద్వారా ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి

బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్

కలెక్టర్లతో పర్యాటక, సాంస్కృతిక శాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీసీ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను జిల్లాల్లో పండుగ వాతావరణంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు, పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై ఆమె సుదీర్ఘంగా సమీక్షించారు.

​ఈ సందర్భంగా వాణీ ప్రసాద్ మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించే వేదికగా మార్చాలని సూచించారు. ప్రస్తుత ‘సూపర్ ఎల్‌నినో’ పరిస్థితుల నేపథ్యంలో నీటి పొదుపు, వర్షపాతం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలన్నారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, పార్కింగ్ వసతులను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, ఫోటోలు, వీడియోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని స్పష్టం చేశారు.

​పీపీపీ విధానంలో హరిత హోటళ్ల పూర్తి

​రాష్ట్రంలో జిల్లాలకు బదిలీ చేసిన 56 పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల పనులను స్థానిక ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలని ఆదేశించారు. రెండు వారాల్లోగా ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికల తయారీ బాధ్యతలను ఇంజినీరింగ్ శాఖలు లేదా కన్సల్టెన్సీలకు అప్పగించాలని స్పష్టం చేశారు. పాక్షికంగా పూర్తయిన హరిత హోటళ్లను పూర్తి చేసి నిర్వహణలోకి తెచ్చేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పెట్టుబడులను ప్రోత్సహించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారుల సహకారం తీసుకోవాలని సూచించారు.

​స్వదేశ్ దర్శన్ పథకం, ఇతర కేంద్ర, రాష్ట్ర నిధుల ద్వారా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, భద్రత కల్పించాలని, స్థానిక స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు పర్యాటకంతో అనుసంధానం కల్పించి ఉపాధి పెంచాలన్నారు. కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా రెవెన్యూ అధికారి గీత, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.

 

Views: 4
Tags:

About The Author

Related Posts

Latest News

శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు! శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు!
పని పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనా స్పందన శూన్యం.. పక్కనే మరో షెడ్ శరవేగంగా నిర్మాణం   శేరిలింగంపల్లి,అక్టోబర్ 15,(డిడి9 వార్త): శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలోనే అక్రమ...
ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత
బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్
పాఠశాలల్లో అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌లో ఘనంగా 'నానబియ్యం' బతుకమ్మ వేడుకలు
‘వి క్యూబ్’ ప్రారంభానికి బ్రేక్‌!