ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత

డబుల్ ట్రాక్ విస్తరణ పనుల దృష్ట్యా ...​45 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు

ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని  కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత

వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్యw

నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ రైల్వే అండర్పాస్ (ఎన్టీఆర్ చౌరస్తా నుంచి జెడ్పీ చౌరస్తా, కంటేశ్వర్ బైపాస్ వెళ్లే మార్గం) ఇక మూతపడనుంది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో చేపడుతున్న డబుల్ ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా.. అండర్పాస్ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అనగా ఈ నెల 16వ తేదీ ఉదయం నుంచే సుమారు 45 రోజుల పాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

​దారులు ఇలా మళ్లింపు..

ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ నగరంలోకి ప్రవేశించే వాహనాలు కంటేశ్వర్ బైపాస్, మీసేవ కంటేశ్వర్ మీదుగా సాగాలి. ఒకవైపు పనులు పూర్తయిన రైల్వే అండర్పాస్ గుండా ప్రయాణిస్తూ ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి కుడి వైపునకు తిరిగి రైల్వే స్టేషన్ ముందర నుంచి బస్టాండ్ చేరుకోవాలని సూచించారు.

​ఇక నిజామాబాద్ నుంచి ఆర్మూర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దేవీ రోడ్డు రైల్వే ఫ్లైఓవర్ ఎక్కి, దుబ్బ శివాజీ విగ్రహం మీదుగా దుబ్బ రోడ్డులో ప్రయాణించాలి. దుబ్బ చౌరస్తాలోని శ్రీ మహాలక్ష్మి టెంపుల్ వద్ద ఎడమ వైపునకు మలిపి ఖానాపూర్ చౌరస్తాకు చేరుకోవచ్చు. అలాగే మహాలక్ష్మి టెంపుల్ దుబ్బ చౌరస్తా నుంచి నేరుగా జీజీ కాలేజ్ ‘యు’ టర్న్ వరకు వెళ్లి బైపాస్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి కంటేశ్వర్ డీఎస్ చౌరస్తాకు వెళ్లవచ్చని పేర్కొన్నారు.

​అలాగే హైదరాబాద్, కామారెడ్డి వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, పులాంగ్ చౌరస్తా నుంచి మాధవనగర్ రైల్వే గేట్ దాటాలి. అక్కడి నుంచి మాధవనగర్ బైపాస్ మీదుగా హైదరాబాద్ రోడ్డును చేరుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు బోధన్, బాన్సువాడ, వర్ని వైపు వెళ్లే వాహనాలు మాత్రం ఎటువంటి మళ్లింపులు లేకుండా యథావిధిగా పాత మార్గంలోనే రాకపోకలు సాగించవచ్చని వెల్లడించారు.

​అత్యవసరమైతే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..

రైల్వే అండర్పాస్ పనులు సుమారు 45 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నందున, నగర ప్రజలు పోలీస్ శాఖ సూచించిన దారులనే ఉపయోగించి రాకపోకలు సాగించాలని సీపీ కోరారు. ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అత్యవసరంగా సంప్రదించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచారు. ​నిజామాబాద్ ఆర్టీసీ కంట్రోల్ రూమ్: 9959226022,  పోలీస్ కంట్రోల్ రూమ్ సెల్: 8712659700, ల్యాండ్ లైన్: 08462-226090, ​ట్రాఫిక్ ఎస్హెచ్ఓ (నిజామాబాద్) సెల్: 8w712659842

 

 

Views: 10
Tags:

About The Author

Related Posts

Latest News

శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు! శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు!
పని పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనా స్పందన శూన్యం.. పక్కనే మరో షెడ్ శరవేగంగా నిర్మాణం   శేరిలింగంపల్లి,అక్టోబర్ 15,(డిడి9 వార్త): శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలోనే అక్రమ...
ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత
బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్
పాఠశాలల్లో అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌లో ఘనంగా 'నానబియ్యం' బతుకమ్మ వేడుకలు
‘వి క్యూబ్’ ప్రారంభానికి బ్రేక్‌!