ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఆర్ అండ్ బీ, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షా సమావేశం

ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

నగరంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ పనుల్లో వేగం పెంచాలని, అభివృద్ధిలో పురోగతి సాధించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్‌లోని చారిత్రక కట్టడమైన ఖిల్లా రామాలయ అభివృద్ధి కోసం తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తెలిపారు. ఆలయ అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించి రోప్‌వే ఏర్పాటుకు డీపీఆర్ (సవివర ప్రాజెక్టు నివేదిక) సిద్ధం చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇటీవల ఆర్ అండ్ బీ అధికారులతో పాటు రోప్‌వే నిర్మాణ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులనుa ఆదేశించారు.

​అంతకుముందు పబ్లిక్ హెల్త్ అధికారులతోనూ ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందూరులో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ట్యుఫిడ్స్ (TUIDFIC) రూ. 60 కోట్ల అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా యూజీడీ పనులు నత్తనడకన సాగుతుండటంపై అధికారులకు తగిన సూచనలు జేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ​ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ డీఈలు నాందేవ్, రామ్మోహన్, ఏఈ సాయికుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ యోగేష్, ఏఈ శివకృష్ణ, యూజీడీ వర్క్స్ మేనేజర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20261013-WA0588

Views: 1
Tags:

About The Author

Related Posts

Latest News

శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు! శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు!
పని పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనా స్పందన శూన్యం.. పక్కనే మరో షెడ్ శరవేగంగా నిర్మాణం   శేరిలింగంపల్లి,అక్టోబర్ 15,(డిడి9 వార్త): శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలోనే అక్రమ...
ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత
బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్
పాఠశాలల్లో అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌లో ఘనంగా 'నానబియ్యం' బతుకమ్మ వేడుకలు
‘వి క్యూబ్’ ప్రారంభానికి బ్రేక్‌!