వికలాంగులకు భాస్కరన్న భరోసా

బాన్సువాడ, అక్టోబర్ 13(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని దివ్యాంగులకు అండగా నిలిచేందుకు భాస్కరన్న ముందుకు వచ్చారని బీర్కూర్ మండల నాయకులు తెలిపారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారిని గుర్తించి, వారి వివరాలను సేకరించి భాస్కరన్న దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులను లండన్ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయించి తెప్పించి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి సహాయం అందించి, వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు భాస్కరన్న భరోసా కల్పిస్తున్నారని మండల నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు బోయిని శంకర్, యువనాయకులు మియాపురం శశికాంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ యామ రాములు, మండల ఉపాధ్యక్షులు గొండ్ల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గొండ్ల రాజు, ఆత్మకమిటీ డైరెక్టర్ సందుల రవి, వార్డు మెంబర్లు కొరిమె రఘు, ప్రశాంత్ యాదవ్, ఇందూరి గజేందర్, లక్ష్మినారాయణ, హైమద్, జంగం గంగప్ప, చింతం అంబయ్య, మేత్రి గంగారాం తదితరులు పాల్గొన్నారు.

