ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం సెప్టెంబర్ 2 (డిడి9 వార్త)ఏజెన్సీ మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు ఆది కర్మయోగి అభియాన్ పథకంలో భాగంగా సేవ, సంకల్ప, సమర్పణ అనే నినాదంతో వివిధ శాఖల అధికారులు గిరిజనులను చైతన్య పరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
మంగళవారం నాడు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్,ఇతర శాఖల అధికారులు మరియు మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్ మాస్టర్ శిక్షకులతో ఆది కర్మయోగి అభియాన్ పథకం విజయవంతం అవ్వడానికి మండల్ లెవెల్ శిక్షకుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల్ లెవెల్ శిక్షకులకు పలు సూచనలు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతాలలో నివసించే గిరిజన కుటుంబాలు వారి ఆచారాలు, వారి జీవన శైలి, పద్ధతులు చాలా పురాతనంగా ఉంటాయని, ఆ గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలు అందించడానికి గ్రామంలోనీ గిరిజన యువకులు మరియు మహిళల సహాయంతో గ్రామములో ఇంటింటికి మరియు పొలాల గట్ల వెంబట తిరిగి సమస్యలు తెలుసుకుని వారికి కావలసిన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. గ్రామంలో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించాలని, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, లవ్లీ వుడ్, ఫారెస్ట్ మంచినీరు, మేకల పెంపకం, మునగ చెట్ల సాగు, అంగన్వాడి మరియు పాఠశాల భవనాలు, జీవిత బీమా, ఆది సురక్ష బీమా వంటి పథకాలు గిరిజనులకు తెలియజేసి కావలసిన వారికి అక్కడే దరఖాస్తులు రాయించుకొని పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ శిక్షణ శిబిరంలో మాస్టర్ ట్రైనర్స్ చెప్పింది ప్రతి అంశం మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్ శిక్షకులు శ్రద్ధగా విని గ్రామములో తప్పనిసరిగా అమలు చేయాలని, గ్రామంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం ఫోటో కవరేజ్ వీడియో కవరేజ్ తప్పనిసరిగా చేయాలని అన్నారు గిరిజనుల సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రతి శాఖ అధికారి నిర్లక్ష్య వైఖరి కనబరచకుండా ప్రత్యేక శ్రద్ధతో అమలుచేసి ప్రతి ఒక్క గిరిజనులకు లబ్ధి చేకూరేలా కృషి చేయాలని అన్నారు.
అనంతరం ఐటీడీఏ పి ఓ రాహుల్ మాట్లాడుతూ సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ ద్వారా విడుదల అయ్యే సంక్షేమ పథకాలు గిరిజన గ్రామాలలో అమలవు తున్నాయని, ఈ పథకాలు గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులకు అందించి వారి సంక్షేమానికి దోహదపడుతున్న అధికారులు గిరిజనులకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని, ఈ పథకాలు ప్రతి గిరిజనులకు అందించి వారి జీవనోపాధికి మరియు సంక్షేమానికి లబ్ధి చేకూరేల మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ ఆది కర్మయోగి అభియాన్ అనే కొత్త కార్యక్రమం అమల్లోకి తీసుకువచ్చిందని, ఈ పథకాలు గ్రామములో విస్తృతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని శాఖలను గుర్తించి వారికి స్టేట్ లెవెల్ లో శిక్షణ ఇవ్వడం జరిగిందని, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, విద్య, వైద్యం, ఫారెస్ట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రూరల్ వాటర్ డిపార్ట్మెంట్ శాఖల అధికారులు గ్రామాలలో చేపట్టవలసిన కార్యాచరణ గురించి ఇక్కడ మూడు రోజులు శిక్షణ అందిస్తారని, శిక్షణ తీసుకున్న అధికారులు ఈనెల 9, 10 తేదీలలో గ్రామాలలో పర్యటించి గ్రామంలోని ఎన్జీవోస్ సహకారంతో వ్యక్తిగత మరియు కమ్యూనిటీ పరంగా బెనిఫిట్స్ గురించి గిరిజన ప్రజలకు తెలియజేసి వారి సంక్షేమానికి పాటుపడే విధంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలని ఆయన అన్నారు.ఆది కర్మయోగి అభియాన్ పథకం మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న 19 మండలాలలోని 130 గ్రామాలలో పగడ్బందీగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలతో పాటు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
అనంతరం ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద గ్రామాలలో బ్లాక్ లెవెల్ అధికారులు చేపట్టవలసిన కార్యాచరణ గురించి శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, డిడబ్ల్యుఓ స్వర్ణలత లేనినా, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఏవో సున్నం రాంబాబు,జిల్లా మాస్టర్ శిక్షకులు మధువన్, మాధవరావు, జస్వంత్ ప్రసాద్, సంతోష రూపా, సలీం మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.