బరంగ్ ఎడ్గి గ్రామస్థుడు లింగమయ్య దుర్మరణం

బాన్సువాడ, నవంబర్ 06(డిడి9 వార్త): బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామానికి చెందిన ధమ్మని లింగమయ్య(65) పొలం వద్దకాలువలో పడి మృతిచెందారు. గ్రామస్థుల సమాచారం ప్రకారం, లింగమయ్య గన్నారం శివారులోని పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ అనుకోకుండా జారి కాలువలో పడిపోయింది.తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.ప్రమాద వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.పోస్టుమాస్టమ్ నిమిత్తం బోధన్ ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు.

Views: 279
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు