108 అంబులెన్స్‌పై ఆకస్మిక తనిఖీ వైద్య సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి మెడికల్ టెక్నీషియన్ కూడలి నారాయణ ను అభినందించిన మేనేజర్ జనార్ధన్
బాన్సువాడ,డిసెంబర్ 23(డిడి9 వార్త):
పొతంగల్ గ్రామంలో సేవలందిస్తున్న 108 అత్యవసర అంబులెన్స్‌ను మంగళవారం ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ (ఈఎంఈ స్వరాజ్) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాలు, మందుల నిల్వలు, కాలపరిమితి ముగిసిన ఔషధాలపై ప్రత్యేకంగా పరిశీలన నిర్వహించారు.అంబులెన్స్ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, పరికరాల పనితీరు, ఎమర్జెన్సీ సేవల నిర్వహణ తీరును సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో సేవలందించే విధానంపై సిబ్బందికి సూచనలు చేశారు.ఈ తనిఖీలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కూడలి నారాయణ, అంబులెన్స్ పైలెట్ తరుణ్ కృష్ణ పాల్గొన్నారు. సిబ్బంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.పొతంగల్ ప్రాంత ప్రజలకు అంబులెన్స్ సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, 108 అంబులెన్స్ సేవలను ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌ను వినియోగించి సకాలంలో వైద్యం పొందాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

