న్యాయ సేవలు దూరం కాదు.. ఇక ఆర్మూర్‌లోనే!

నిజామాబాద్ జిల్లాకు 4, ఆర్మూర్‌కు ఒక కోర్టు కేటాయింపు

న్యాయ సేవలు దూరం కాదు.. ఇక ఆర్మూర్‌లోనే!

​హర్షం వ్యక్తం చేసిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్ చందర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 200 కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానిక ప్రజలకు ఎంతో ఊరటనిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి నాలుగు, ఆర్మూర్‌కు ఒక కోర్టు మంజూరు కావడం పట్ల ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్ చందర్ హర్షం వ్యక్తం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్‌లో కోర్టు ఏర్పాటు కావడం వల్ల స్థానిక ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువవుతాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకు న్యాయపరమైన పనుల కోసం జిల్లా కేంద్రానికి లేదా ఇతర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. దీనివల్ల ప్రజలకు ప్రయాణ ఖర్చులతో పాటు విలువైన సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. ​కక్షిదారులు, సాక్షులు, న్యాయవాదులు విచారణలకు హాజరుకావడం మరింత సులభతరమవుతుందని ప్రవీణ్ చందర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్మూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సత్వర న్యాయం అందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. స్థానిక న్యాయవాదులకు వృత్తిపరమైన అవకాశాలు మెరుగవడంతో పాటు, కోర్టు కార్యకలాపాల ద్వారా స్థానిక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణమే తగిన మౌలిక సదుపాయాలు కల్పించి, అవసరమైన సిబ్బంది, న్యాయమూర్తులను నియమించి కోర్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Views: 20
Tags:

About The Author

Related Posts

Latest News

న్యాయ సేవలు దూరం కాదు.. ఇక ఆర్మూర్‌లోనే! న్యాయ సేవలు దూరం కాదు.. ఇక ఆర్మూర్‌లోనే!
​హర్షం వ్యక్తం చేసిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్ చందర్
శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు!
ఈ నెల16 నుంచి నిజామాబాద్ లోని కంటేశ్వర్ అండర్పాస్ మూసివేత
బతుకమ్మ సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి: వాణీ ప్రసాద్
పాఠశాలల్లో అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖిల్లా రామాలయానికి రోప్‌వే డీపీఆర్ సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్‌లో ఘనంగా 'నానబియ్యం' బతుకమ్మ వేడుకలు