బొగత జలపాతం అందాలు – ప్రకృతి ఒడిలో స్వరాగాలు
బొగత జలపాతం అందాలు – ప్రకృతి ఒడిలో స్వరాగాలు
వాజేడు,సెప్టెంబర్ 7,(డిడి9 వార్త):
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని బొగత జలపాతం వర్షాకాలంలో తన అపూర్వ స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. కొండల నడుము నుంచి ప్రవహించే నీరు శ్వేతా నాగు లాగా పారుకుంటూ ఎతైన కొండల పై నుండి కిందకు జాలువారుతుంటే ఎంతటి అందమైన దీనిముందు దిగదుడుపే అనిపిస్తుంది అక్కడ నిల్చుని చూస్తుంటే స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది జలపాతం నుండి వచ్చే సవ్వడి, చుట్టూ విస్తరించిన అడవి, ఆడే పక్షుల కిలకిలలు మరియు రంగురంగుల సీతాకోకచిలుకలు కలసి ప్రకృతిలో ఒక జీవంత కవిత్వాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ రోజు ఆదివారం కావడంతో పర్యాటకులు అధికంగా తరలి వచ్చి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. కొందరు ఫోటోగ్రఫీ కోసం, కొందరు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడానికి చేరుకొని జలపాతం ఒడిలోని అందాలను గమనిస్తున్నారు. అడుగు అడుగు వర్షపు చల్లని నీటి స్పర్శ, పక్షుల మధురమైన కిలకిల, సీతాకోకచిలుకలు చిలికే రంగులు, జలపాతం గర్జన – ఈ అందాల సమ్మేళనం ప్రతి పర్యాటకుడిని మంత్రముగ్ధులను చేస్తుంది.
ప్రకృతిలో ప్రతి ఒక్క మూమెంట్ ఒక కథను చెబుతోంది. జలపాతం నుంచి వచ్చే శబ్దం, చుట్టూ విస్తరించిన అడవి గాలి, పక్షుల శ్రుతులు మరియు రంగురంగుల బటర్లిఫ్లైలు – ఇవన్నీ కలిసిపోయి ఒక నిజమైన స్వర్గధ్వని వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఈ స్వర్గధ్వని వాతావరణాన్ని ఒకసారి తప్పకుండా చూడాలని, కళ్లతో చూసినవారు మళ్లీ చూడాలని అనుకుంటారు.
బొగత జలపాతం వర్షాకాలం సీజన్‌లో తన పూర్తి సౌందర్యాన్ని చూపిస్తూ, పర్యాటకులకు ఒక సులభమైన కానీ అపూర్వమైన ప్రకృతి అనుభవాన్ని అందిస్తుంది.