వాజేడు మండలం లో రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొన్న బైక్… యువకుని కి గాయాలు.
On
ములుగు జిల్లా, వాజేడు సెప్టెంబర్ 8 ( డిడి 9 వార్త) జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వాజేడు మండలంలోని టేకులగూడెం పంచాయతీ పరిధిలోని పావురాల వాగు వద్ద జాతీయ రహదారి-163పై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
చండ్రుపట్ల గ్రామానికి చెందిన పాయల రాంబాబు ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఢీకొన్న దాటికి రాంబాబు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన అతడిని తొలుత ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు కొంత పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు తరలించినట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించి పేరూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Views: 1
About The Author
Related Posts
Latest News
09 Sep 2025 11:37:17
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఎప్పటిలాగే...