ఎరువుల కోసం గంటల తరబడి క్యూ…
స్పృహ తప్పి కిందపడ్డ రైతు
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సెప్టెంబర్ 8 ( డిడి 9 వార్త)
చర్ల మండలం సత్యనారాయణపురం ఎరువుల డిపోలో సోమవారం ఉదయంతోనే ఉద్రిక్తత దృశ్యాలు చోటుచేసుకున్నాయి. యూరియా కోసం రైతులు తెల్లవారినప్పటి నుండి భారీగా క్యూ కట్టి నిలబడ్డారు. ఈ క్రమంలో తిప్పాపురం గ్రామానికి చెందిన సోమయ్య అనే రైతు ఉదయం ఐదు గంటల నుండి 11:30 వరకు క్యూలో నిలబడటంతో తీవ్రమైన అస్వస్థతకు గురై స్పృహ తప్పి కిందపడ్డాడు.
సహచర రైతులు అప్రమత్తమై అతన్ని తక్షణమే దగ్గరలోని సత్యనారాయణపురం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించడంతో ఎటువంటి ప్రమాదం తప్పిందని తెలిపారు. అయితే, రైతులను ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువు కొరతకు పరిష్కారం చూపాలని, రైతులకు గౌరవప్రదంగా సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు
Views: 14
About The Author
Latest News
09 Sep 2025 11:37:17
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఎప్పటిలాగే...