పేద ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి - కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చిడం సాంబశివరావు
వెంకటాపురంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు.
ములుగు జిల్లా వెంకటాపురం, సెప్టెంబర్ 2 (డిడి9 వార్త)
మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంకటాపురంలో ఘనంగా నివాళి
వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాల నిశ్శబ్ధ ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడం సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నాయకుడు, పేద ప్రజల ఆరాధ్య దైవం అని సేవలను కొనియాడారు. పేద ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మహనీయులు డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అని అన్నారు. ప్రతి ఒక్కరం కూడా డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఆశల బాటలో నడవాలని కోరారు. పలువురు ప్రసంగిస్తూ వైఎస్ఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనియాడారు. ముఖ్యంగా రైతుల కోసం తీసుకువచ్చిన పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి సంచలనాత్మక కార్యక్రమాలను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడం సాంబశివరావు ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మన్యం సునీల్ బాబు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయికృష్ణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జలిగంపల కళాధర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాధనపల్లి శ్రీనుసీనియర్ నాయకులు మద్దుకూరి ప్రసాదు. బాలసాని వేణు గాంధర్ల నాగేశ్వరరావు ఇప్పని సమ్మయ్య. రంగా నాయుడు కారం వీర్రాజు. డారా రవి గుండమ్మల కిరణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు