వరదలలో నష్టపోయిన చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలి

వరదలలో నష్టపోయిన చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలి

ffe9a2ce-7e27-4200-ae86-c5293cb3b4ca

సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి

కొనసాగుతున్న సిపిఐఎం సమస్యల అధ్యయన యాత్రలు

భద్రాచలం,ఆగస్టు 31,(డిడి9 వార్త):గత రెండు నెలలుగా భద్రాచలం పట్టణంలో గోదావరి వరద ఉధృతి పెరిగి ఇప్పటికి మూడుసార్లు గోదావరి వరద పోటెత్తిన సందర్భంగా భద్రాచలం వచ్చే యాత్రికుల మీద ఆధారపడి జీవించే గోదావరి ఒడ్డున  ఉన్నటువంటి సుమారు 80 మంది చిరు వ్యాపారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారులను వారి పరిస్థితులను సిపిఎం బృందం మాస్ లైన్ ప్రోగ్రాంలో భాగంగా వెళ్లి వారిని అడిగి తెలుసుకున్న సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది వల్ల ఇప్పటికే మూడుసార్లు 45 అడుగుల ఒకసారి 52 అడుగులు ఒకసారి పైచిలుకు వరద వచ్చిన సందర్భంలో ఇప్పటికీ 47 అడుగుల పైచిలుకు వరద ఉన్నప్పటికీ గత రెండు నెలలుగా వారు యాత్రికుల మీద ఆధారపడి సాగిస్తున్న చిరు వ్యాపారాలు లేక అనేక ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ చూసేవారికి వీరు వరద బాధితుల కింద కనపడరని కానీ నిరంతరం వరదగా వరదలకు గురై ఇబ్బందులు పడుతున్నారని గోదావరి పెరిగినప్పుడల్లా వారి  దుకాణాలను పైకి మోసుకొస్తూ తగ్గినప్పుడల్లా మరలా కిందకి దించుతూ ఈ విధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వారికున్నటువంటి జీవనాధారం మొత్తం దెబ్బతిన్నదని దీని వలన కుటుంబాలు గ డవడం కూడా కష్టంగా మారి  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున ప్రభుత్వం వెంటనే వారికి నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని అలాగే ఆర్థికం గా వేసులుపాటు  కల్పించాలని భద్రాచలంలోని స్వచ్ఛంద సంస్థలు కూడా వారి 80 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు ఇచ్చే దానికి ప్రయత్నించాలని కోరినారు వాస్తవంగా వినాయక చవితికి నిమజ్జనానికి వచ్చే యాత్రికులతో వారి వ్యాపారాలు బాగా సాగేవని కానీ ఇప్పుడు గోదావరి పెరుగుతున్నందున యాత్రికులను గోదావరిలోకి దిగనివ్వకపోవటం వలన ఆ వ్యాపారాలు కూడా లేవని కావున వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు, ధనకొండ రాఘవయ్య, శాఖ కార్యదర్శి శ్రీను ,ఆది, పోసి, మరియు సభ్యులు రమణ ,వెంకన్న ,గంగ, భవాని, కుమారి, మరియు స్థానిక చిరు వ్యాపారులు పాల్గొన్నారు

Views: 5

About The Author

DHARMAGADDA Venkatesh Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Latest News

కన్నుల పండువగా రామయ్య నిత్య కళ్యాణం కన్నుల పండువగా రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం సెప్టెంబర్ 9 ( డిడి 9 వార్త ) భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు...
లండన్‌లో 117 మంది సంగీతకారులతో ‘ఓజీ’ బీజీఎం – థమన్ ప్రత్యేక సర్ప్రైజ్
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సెన్సార్ పూర్తిచేసుకున్న తేజా సజ్జా ‘మిరాయ్’ – U/A సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధం"
వేములవాడలో జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోకో – అరెస్టులో విద్యార్థి నాయకులు
10 మంది ఎమ్మెల్యేలు : అనర్హతా.? రాజీనామాలా.?