బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఎప్పటిలాగే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, సెలబ్రిటీలతో పాటు కామనర్స్‌కి కూడా అవకాశం కల్పించారు. మొదట 13 మంది సామాన్యులను అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి, అందులో ప్రజల ఓటింగ్, జ్యూరీ ఎంపికల ఆధారంగా 5 మందిని హౌస్‌లోకి పంపించారు. మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 5 మంది కామనర్స్ కలిసి ఆటను మొదలుపెట్టారు.
హోస్ట్ నాగార్జున స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి, షోను మరింత హైలైట్ చేశారు. ఇక మొదటి రోజే హౌస్‌లో ఫన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ మొదలయ్యాయి. ముఖ్యంగా జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి ఎంట్రీతోనే అట్రాక్షన్‌గా నిలిచింది.
ఆరంభంలోనే కామనర్ జవాన్ పవన్ కళ్యాణ్‌తో చిన్న గేమ్ ఆడుతూ రీతూ రొమాంటిక్ సీన్స్ పండించింది. ఎవరు కళ్లు ఆర్పకుండా ఎక్కువ సేపు చూస్తారో అని ఛాలెంజ్ ఇచ్చి, అతనితో ఐ కాంటాక్ట్ కొనసాగించింది. చివరకు రీతూ కళ్లల్లో నీళ్లు రావడంతో కళ్లను మూసేసింది కానీ పవన్ మాత్రం చివరివరకు నిలబడిపోయాడు. ఈ చిన్న సీన్‌తోనే రీతూ రొమాంటిక్ యాంగిల్ బయటపడిందని హౌస్‌మెట్స్ చర్చించుకున్నారు.
ఇక బిగ్ బాస్ కూడా ఈ ట్రాక్‌ను ఎంకరేజ్ చేస్తే, రాబోయే రోజుల్లో రీతూ చౌదరి రొమాన్స్ డోస్ మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయం.