మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పై బీజేపీ నిరసన

బీర్కూర్, ఏప్రిల్ 18(డిడి9 వార్త):

మహిళలను అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీశక్తి వందన్ ద్వారా 33% మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ కూటమి పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేసిందని ఆరోపిస్తూ బీర్కూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగేల్ల సాయికిరణ్ మాట్లాడుతూ, 1996, 1998 సంవత్సరాల్లో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అలాగే 2010లో కూడా ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు వ్యతిరేకించిందని తెలిపారు.మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపుతోందని తీవ్రంగా ఖండిస్తూ, మహిళల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్, ఉపాధ్యక్షులు చేపూరి హనుమాన్లు, వడ్ల బసవరాజ్, సీనియర్ నాయకులు పోంచుగొండ, బీరుగొండ, మదారి శ్రీనివాస్, పండరి, సాయిబాబా, అలాగే కార్యకర్తలు బాబు గోండ, శ్రావణ్, అవారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు