కాంటాలు లేక రైతుల ఆందోళన… సొసైటీకి తాళం వేసి నిరసన

బీర్కూర్, ఏప్రిల్ 19(డిడి9 వార్త):

మండలంలోని బైరాపూర్ గ్రామంలో రైతులు సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. సొసైటీ పరిధిలో కోసిన ధాన్యానికి కాంటాలు పెట్టడం లేదని, ఇతర గ్రామాలకు వెళ్లి కాంటాలు పెడుతున్నారని రైతులు ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ కార్యదర్శి గత వారం రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో పాటు, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు తెలిపారు.వాతావరణ హెచ్చరికలు ఉన్న ఈ సమయంలో ధాన్యం తడిసిపోతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 4న కోసిన వడ్లకు ఇప్పటికీ కాంటాలు పెట్టకపోగా, 18వ తేదీన కోసిన వడ్లకు మాత్రం వెంటనే కాంటాలు పెట్టారని రైతులు ఆరోపించారు.రైతుల మధ్య వివక్ష చూపకుండా వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే మరింత పెద్ద స్థాయిలో ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.

Views: 54
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు