వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి క్రీడా సామగ్రి పంపిణీ

బీర్కూర్, ఏప్రిల్ 19(డిడి9 వార్త):
బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో ఆదివారం వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.యువత ఇంటిపట్టునే ఉంటూ పిల్లల్లో మేధాశక్తి పెంపొందించేందుకు చిన్నారులకు చెస్ బోర్డులు, అలాగే పెద్ద పిల్లల శారీరక దృఢత్వం కోసం వాలీబాల్ కిట్స్ ను నాచారం హన్మాండ్లు (విఆర్వో) సహకారం అందించగా, చెస్ బోర్డులు అందించడంలో సిద్ధం శెట్టి నారాయణ గుప్తా (ప్రొఫెసర్) సహకరించారు.ఈ సందర్భంగా పిల్లలు, యువత వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధ, వారిలో ప్రతిభను వెలికితీయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న మీ ప్రోత్సాహం ఎంతో గొప్పదని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత లక్కపల్లి, పోచుగొండ, నాగెల్ల సాయికిరణ్, నవీన్, శ్రీకాంత్, గంగా ప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Views: 59
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు