భైరాపూర్ గ్రామంలో నెలరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచివేత – ప్రజావాణిలో ఫిర్యాదు

బీర్కూర్, ఏప్రిల్ 20(డిడి9 వార్త):

బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామానికి గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు ఉపసర్పంచి కుమ్మరి అజయ్,వార్డు మెంబర్ సాయాగౌడ్,రాములు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పలుమార్లు మిషన్ భగీరథ అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేసవి తీవ్రత పెరిగి ఎండలు మండుతున్న తరుణంలో, కనీస అవసరాలకు కూడా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారిందని, తాగునీటి కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భైరాపూర్ గ్రామానికి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Views: 249
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు