పేదల పెన్నిధి… ముఖ్యమంత్రి సహాయ నిధి

బీర్కూర్, ఏప్రిల్ 18(డిడి9 వార్త)
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు ఆపన్నహస్తంగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గొండ్ల శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో శనివారం గ్రామానికి చెందిన లక్కపల్లి సత్యవ్వకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.31,000 చెక్కును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేకమంది పేదలు వైద్య సహాయం పొందుతూ ఉపశమనం పొందుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సహాయం అందుతోందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గాన్ని కన్నతల్లిలా భావిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అలాగే నాయకుడిపై అనవసర విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోండ్ల రాజు, గ్రామ మాజీ సర్పంచ్ ఇందూర్ లక్ష్మన్, నాయకులు కాదేపురం గంగన్న, ఇందూర్ గజేందర్, కుమ్మరి గంగారాం, మేత్రి నాగుగొండ, గూడెం సాయిబాబు, సందుల రవి, లక్కపల్లి మొగులుగొండ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 40
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు