జిహాదీ మనస్తత్వంపై గర్జించిన ఆర్మూర్

జిహాదీ మనస్తత్వంపై గర్జించిన ఆర్మూర్

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన

దేశంలో పెరుగుతున్న వికృత జిహాదీ మనస్తత్వానికి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ శ్రేణులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో నెలకొంటున్న అశాంతిని, సాంఘిక దురాచారాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

లవ్ జిహాద్ కుట్రలను అరికట్టాలి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నాసిక్ ఘటనతో పాటు దేశవ్యాప్తంగా సాగుతున్న 'లవ్ జిహాద్' కుట్రలను తీవ్రంగా ఖండించారు. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అక్రమ ఆక్రమణలు.. అపవిత్ర చర్యలపై ఆగ్రహం

అటవీ, రైల్వే, సైనిక మరియు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్న తీరుపై ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందూ కుటుంబాల వేధింపులు, గిరిజన బాలికలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని, వీటన్నింటి వెనుక ఉన్న దేశ వ్యతిరేక శక్తులను అణిచివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేషా సంపర్క్ ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, జిల్లా ప్రచార ప్రముఖ్ బొచకర్ నిఖిల్, నగర ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, సహా కార్యదర్శి బోబిడే కరణ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, అభిలాష్, శ్రీకాంత్, అరవింద్, సచిన్, సాయి, యోగేష్, రిషి, లింబాద్రి, రఘు, బిట్టు, అభినయ్, విజయ్, ధనుంజయ, కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20260417-WA0080

Views: 50
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు