2027లో భారీగా రానున్న క్రిష్ 4 – రాకేశ్ రోషన్ తాజా అప్‌డేట్
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన క్రిష్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకమే. 2003లో కోయి మిల్ గయా, 2006లో క్రిష్, 2013లో క్రిష్ 3 సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘క్రిష్ 4’ పై కొత్త అప్‌డేట్ వచ్చింది.
ఇంతవరకు ఈ సిరీస్‌కు హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ే దర్శకత్వం వహించారు. అయితే ఈసారి మాత్రం హృతిక్ రోషన్ స్వయంగా డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. గతంలో రాకేశ్ రోషన్ మాట్లాడుతూ, “భారీ బడ్జెట్ కారణంగా సినిమా ముందుకు కదలడం లేదు. ఖర్చు తగ్గిస్తే సినిమా గ్రాండ్ ఫీల్ కోల్పోతుంది” అని చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా రాకేశ్ రోషన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ:-
“స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ బడ్జెట్ విషయంలో ఒత్తిడి వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో స్పష్టత వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలుపెడతాం. 2027లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని వివరించారు.
అంటే, హృతిక్ రోషన్ డైరెక్షన్‌లో ‘క్రిష్ 4’ 2027లో విడుదల కావొచ్చు అన్నది స్పష్టమవుతోంది.