భద్రాచలంలో అనుమతులు లేకుండా నడిపిన జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్ సీజ్.

భద్రాచలంలో అనుమతులు లేకుండా నడిపిన జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్ సీజ్.

భద్రాచలం సెప్టెంబర్ 9
 ( డిడి 9 వార్త )

ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం.  

భద్రాచల పట్టణంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడిపిస్తున్న జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు వెల్లడించారు.

మంగళవారం కూనవరం రోడ్డులోని శుభం ఫంక్షన్ హాల్స్ సందులో ఈ జీవధార కొనసాగుతున్న విషయం ఎలక్ట్రో హెర్బల్ ఇటలీ వైద్య విధానం తో వైద్యం చేస్తున్న ఈ ప్రైవేట్ క్లినిక్ ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని పట్టణ ప్రజలు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన సూచనల మేరకు డాక్టర్ సైదులు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ చైతన్య ఆసుపత్రిని సందర్శించి తగిన వివరాలు సేకరించాలని మౌఖికంగా ఆదేశించగా మంగళవారం నాడు తనకి చేయగా తద్వారా జీవధార ఎలక్ట్రో హెర్బల్ పేరుతో ఐదు సంవత్సరాలుగా డాక్టర్ గురు రామకృష్ణ ఎటువంటి అధికారిక పర్మిషన్ లేకుండా క్లినిక్ నడుపుతున్నారని తేలింది. ఆసుపత్రిలోని రికార్డులు పరిశీలించగా ఈ విషయం బహిర్గతమైంది. వెంటనే ఆసుపత్రిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ తనిఖీలో డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆయుష్ వైద్యాధికారి, పాయం శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Views: 74

About The Author

Latest News

 కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత
హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాళోజీ జయంతి...
భద్రాచలంలో అనుమతులు లేకుండా నడిపిన జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్ సీజ్.
2027లో భారీగా రానున్న క్రిష్ 4 – రాకేశ్ రోషన్ తాజా అప్‌డేట్
కన్నుల పండువగా రామయ్య నిత్య కళ్యాణం
లండన్‌లో 117 మంది సంగీతకారులతో ‘ఓజీ’ బీజీఎం – థమన్ ప్రత్యేక సర్ప్రైజ్
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు