బీర్కూర్‌లో ఉచిత షుగర్ పరీక్షలు – ఇద్దరికి వైద్య చికిత్సకు రిఫర్
On
బీర్కూర్, ఏప్రిల్ 17(డిడి9 వార్త):
బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో ఉచిత షుగర్ పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 19 మందికి రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించారు.పరీక్షల్లో ఇద్దరిలో షుగర్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలె రమేష్, సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్ మేకల విఠల్, ల్యాబ్ టెక్నీషియన్లు నారం ప్రవీణ్, భారత్, శ్రీకాంత్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు.
Views: 24
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

