ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు

విద్యార్థులతో ట్రాఫిక్ ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు

పాల్గొన్న రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి

రహదారి నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తామని, తోటి వారికి అవగాహన కల్పిస్తామని సాలూర విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మాచందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి "రహదారి నిబంధనలు పాటిస్తాం - ప్రమాదాలను నివారిస్తాం" అంటూ ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం వంటి అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

చిన్నతనం నుంచే ఇలాంటి సామాజిక స్పృహ కలిగి ఉండాలని, మీ ఇంట్లో పెద్దలకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మచ్చేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలుపాల్గొన్నారు.

WhatsApp Image 2026-04-15 at 12.23.30 PM

Views: 38
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు