సీపీఆర్‌తో ప్రాణాలను కాపాడవచ్చు: నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
By R.Suresh
On
అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణదానం చేయవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన’లో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బ్లూ కోర్ట్ సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సీపీఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... గుండెపోటు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ఆసుపత్రికి చేరేలోపు చేసే ప్రథమ చికిత్స అత్యంత కీలకమని, ముఖ్యంగా నిత్యం ప్రజల మధ్య ఉండే పోలీసులు, ఆటో డ్రైవర్లు ఈ పద్ధతిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వైద్య నిపుణుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపీ మస్తాన్ అలీ, ఐఎంఏ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 37
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

