సేవా పథంలో లయన్స్ క్లబ్

కమ్మర్‌పల్లి బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం

సేవా పథంలో లయన్స్ క్లబ్

సామాజిక సేవలో తమకు సాటిలేరని లయన్స్ క్లబ్ సభ్యులు మరోసారి నిరూపించుకున్నారు. కమ్మర్‌పల్లిమండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్‌పల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్సై అనిల్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చల్లటి వాటర్ క్యాన్లతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ మంచినీరు ఎంతో ఊరటనిస్తుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం లయన్స్ క్లబ్ సభ్యుల బాధ్యతాయుత ప్రవర్తనకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన క్లబ్ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్, సభ్యులు పాలెం నరసయ్య, కనక గంగాధర్, సున్నం మోహన్, బద్రి రాజశేఖర్, గుండోజి రవీందర్, చింత ప్రదీప్, సుంకేట బుచ్చన్న, జగన్, పోల్కం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 16
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు