#chat-puja-is-a-symbol-of-devotional-unity-–-former
Telangana  హైదరాబాద్ 

చట్ పూజ భక్తి, ఐక్యతకు ప్రతీక – మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్

చట్ పూజ భక్తి, ఐక్యతకు ప్రతీక – మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మల్కాజ్ గిరి,అక్టోబర్ 28,(డిడి9 వార్త) బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో బీహారులు ఆధ్యాత్మికంగా, భక్తిశ్రద్ధలతో కార్తీక మాస పర్వదినమైన చట్ పూజ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొని భక్తులతో కలిసి పూజలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ పూజ అనేది భక్తి, ఐక్యత, ఆధ్యాత్మికతకు ప్రతీక. వివిధ ప్రాంతాల వారు ఒకే వేదికపై చేరి సూర్యభగవానునికి పూజలు చేయడం మన సంస్కృతి వైభవానికి నిదర్శనం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సుమన్ నాయక్, కంటెస్టెడ్ కార్పొరేటర్ శివ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.
Read More...