అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు

అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు

జిల్లాలో గతంలో నక్సలైట్ల కాల్పుల్లో వీరమరణం పొందిన 14 మంది పోలీస్‌ అమరవీరుల కుటుంబ సభ్యులకు మంగళవారం 'తెలంగాణ వీర్‌ ఫ్యామిలీ కార్డుల'నుa పంపిణీ చేశారు. జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య స్వయంగా అమరుల కుటుంబ సభ్యులకు ఈ ప్రత్యేక కార్డులను అందజేశారు.

​ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరమరణం పొందిన పోలీసుల సేవలు అమూల్యమైనవన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ 'టీజీ వీర్‌ ఫ్యామిలీ కార్డ్‌' ద్వారా అమరవీరుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు, ఇతర సదుపాయాలు మరింత సులువుగా అందుతాయని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

 

Views: 8
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు