ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్

ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్

ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్-2026 పై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు కమిటీ సభ్యుల జాబితాతో లోక్‌సభ గురువారం అధికారిక బులెటిన్ విడుదల చేసింది. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన మొత్తం 31 మంది ఎంపీలతో ఈ జాయింట్ కమిటీని రూపకల్పన చేశారు. ​ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కీలకమైన పార్లమెంటరీ కమిటీలో భాగస్వామ్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ భద్రత, పారదర్శకత, దేశ ప్రయోజనాలను ప్రామాణికంగా తీసుకుని బిల్లుపై కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై పోరాడుతూనే, దేశహితానికి సంబంధించిన అంశాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.

Views: 19
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు