మారథాన్‌లో పోలీస్‌ కానిస్టేబుళ్ల సత్తా

​మెడల్స్ సాధించిన సిబ్బందికి సీపీ సాయి చైతన్య అభినందనలు

మారథాన్‌లో పోలీస్‌ కానిస్టేబుళ్ల సత్తా

హైదరాబాద్‌లో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎమ్‌డీసీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 42.195 కిలోమీటర్ల 'ఫుల్ మారథాన్‌'ను విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా పోలీసు కానిస్టేబుళ్లను నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య మంగళవారం అభినందించారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జరిగిన ఈ పరుగులో కానిస్టేబుల్‌ పి.మహిపాల్‌ 5 గంటల 05 నిమిషాల 41 సెకన్లలో, సతీష్‌ 5 గంటల 55 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని మెడల్స్ సాధించారు.

​కమిషనరేట్‌ కార్యాలయంలో విజేతలకు మెడల్స్ అందజేసిన సీపీ మాట్లాడుతూ.. విధుల్లో తీరిక లేకపోయినా క్రీడలపై పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. ఇతర సిబ్బందికి ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ మహిపాల్‌ ఇప్పటికే 10కి పైగా రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారని, అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగే వేదాంత హాఫ్ మారథాన్‌కు ఎంపిక కావడం విశేషమన్నారు. భవిష్యత్తులోనూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఓ శేఖర్‌ బాబు పాల్గొన్నారు.

 

 

Views: 3
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు