పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభంలో రూరల్ ఎస్‌ఐ షరీఫ్
సమాజం గర్వించేలా చిన్నారులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ అందుబాటులోకి రావడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎస్‌ఐ షరీఫ్ అన్నారు. నిజామాబాద్జి జిల్లా కేంద్రంలోని డీఎస్ చౌరస్తాలో గల రిలయన్స్ బజార్ మూడో అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన 'అశోక ఛైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్'ను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. అశోక రెహాబ్ గ్రూప్ ఆధ్వర్యంలో నగరంలో 22వ బ్రాంచ్‌ను ప్రారంభించడం శుభపరిణామన్నారు. హైదరాబాద్‌లో ఆదరణ పొందిన ఈ కేంద్రం సేవల ఆధారంగా జిల్లాలోని చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరమైన థెరపీలను స్థానికంగానే అందించనున్నట్లు వైద్యులు డాక్టర్ రాహుల్ గుల్వే, డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే తెలిపారు.
చిన్నారుల్లో ఉండే వివిధ రకాల ఎదుగుదల లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించేందుకు ఎర్లీ ఇంటర్వెన్షన్, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ వంటి అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అశోక రెహాబ్ గ్రూప్ ఎండీలు డాక్టర్ నవితా రాహుల్ గుల్వే, డాక్టర్ శ్వేతా కిరణ్ కుమార్ గుల్వే, జైశీల సచిన్ గుల్వే, ప్రతినిధులు ప్రీతి, సుష్మ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

