ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఈ నెల 3న సర్టిఫికెట్ల పరిశీలన... ​వెల్లడించిన సీపీ సాయి చైతన్య

పోలీస్‌ శాఖ ద్వారా భర్తీ చేసే సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

​నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 3న  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిజామాబాద్‌లోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ మెమోల జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ ఉచిత శిక్షణా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు.a

 

Views: 2
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు